Home రాజకీయాలు కమ్యూనిస్టుల వీక్నెస్ తెరాసా కి బలం!

కమ్యూనిస్టుల వీక్నెస్ తెరాసా కి బలం!

SHARE

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా తరువాత అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన లో మునిగిపోయాయి. ఇక రాష్ట్రం లో వామపక్షాల తంతు గొప్ప విచిత్రంగా మాత్రం వుంది….సీపీఐ కి సీపీఎం కి కూడా టీఆర్ఎస్ ప్రధాన శత్రువు. అయితే ఈ రెండు సారూప్య పార్టీలు ఏకమవ్వచ్చు కదా అంటే మాత్రం …ఊహు. ఎవరి దారిలో వారు వెళ్తాం అన్న వ్యవహారం మిగతా పార్టీలని విస్తు పోయేలా చేస్తోంది.

గాలి వాటం టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసివొచ్చే అంశం…అటువంటి పార్టీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ మహాకూటమి కి ప్లాన్ చేస్తోంది. తెలంగాణ లో ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీచేస్తే తెరాస కి కష్టమే అనే వ్యూహం కాంగ్రెస్ డి. తెదేపా అందుకు సై …విచిత్రం గా బద్ద శత్రువులు కాంగ్రెస్ తెదేపా తెదేపా లు కూడా పొత్తుకు రెడీ అవుతుంటే సీపీఐ…సీపీఎం లు ఎవరి గోల వారిదే అన్న తంతు గా ఉండటం నివ్వెరపరిచే విషయం.

సీపీఐ మహాకూటమికి సై కానీ సీపీఎం నో..ఈ పార్టీ బీఎస్పీ బీఎల్ఎఫ్ తో పాటు జనసేన తో కలిసి పోటీచేసే యోచనలో వుంది.

వామపక్షాలు వేరు కుంపట్లు కావటం నష్టమే కానీ వీసమెత్తు లాభం లేదు పైపెచ్చు ఇతర పార్టీలకి లాభమే కూడా. వాళ్ళల్లో ఐక్యత ఉంటే వాళ్ళ పొజీషన్ ఈ పతికి ఇంకో లెవెల్ లో ఉండేదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.