Home రాజకీయాలు వైకాపా సభ ఎట్ కంచరపాలెం సూపర్ సక్సెస్!!

వైకాపా సభ ఎట్ కంచరపాలెం సూపర్ సక్సెస్!!

SHARE

వైజాగ్ అంటే వైకాపా కి పెద్దగా బలం లేదూ అని సంబరపడి తెదేపా నాయకుల కి ఈ విషయం మింగుడుపడటం కొంచం కష్టమే. జగన్ పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ప్రవేశించి౦ది. వైకాపా నేతలు తమ నాయకుని పై తెలియజేయాలనుకున్న ప్రేమని కంచరపాలెం బహిరంగ సభ ద్వారా తెలియచేసుకున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ కి జనం వేలాదిగా తరలివచ్చి జగన్ ని ఉక్కిరి బిక్కరి చేశారు. ఎటు చూసినా ఖాళీ స్థలం కనిపించడం లేదని, రోడ్లు, వీధులు, బిల్డింగ్ లపైనా.. అన్నీ జనంతో నిండిపోయాయని, ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు రెండు చేతులు జోడించి తన కృతజ్ఞతలు చెబుతున్నానని జగన్ అన్నారు.

విశాఖపట్టణం శివారు కంచరపాలెంలో జరుగుతున్నా భారీ బహిరంగ సభ లో జగన్ మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్టణం టాప్ గేర్ లో దూసుకు వెళ్లిందని అయితే ఇప్పుడు బాబు హయాంలో రివర్స్ గేర్ లో తిరోగమనం చూపిస్తోందని నడుస్తోందని ఇక్కడి ప్రజలు తనకు చెప్పారని అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ విస్తీర్ణానికి చొరవ చూపింది, రహదారులు సహా అభివృద్ధి చేసింది…వందల కుటుంబాలు….రోడ్డున పడకుండా చూసింది తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జగన్ గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత విశాఖ లో అభివృద్ధి మందగించిందని, ఇక బాబు పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కంచరపాలెం సభ సక్సెస్ అవటం జిల్లా వైకాపా శ్రేణుల్లో ఖచ్చితంగా నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అనటం లో ఆశ్చర్యం లేదు.