Home రాజకీయాలు సిగ్గుంటే ఏపీ లో పెట్రో పన్ను తగ్గించి బంద్ లో పాల్గొనండి!!

సిగ్గుంటే ఏపీ లో పెట్రో పన్ను తగ్గించి బంద్ లో పాల్గొనండి!!

SHARE

అధికార తెలుగుదేశం పార్టీ ముందు ఎపి లో అదనంగా పెట్రోల్, డీజిల్ లపై విధిస్తున్న పన్ను శాతాన్నితగ్గించి ఆ తరువాత భారత్ బంద్లో పాల్గొనా లని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. విజయవాడ లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ దరలకు నిరసనగా వైకాపా ఒక కార్యక్రమం చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ విషయం లో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు అన్నారు.

ఆటో కి తాడు కట్టి లాగి పెట్రో దరల పెంపు పై నిరసన తెలిపారు. పెట్రోల్‌ పై రాష్ట్రం విధిస్తున్న పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లీటర్‌ పెట్రోల్‌ కి చంద్రబాబు సర్కార్‌ అదనంగా రూ. 4 భారం మోపుతోందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ తో నాలుగేళ్లు కలిసి వుంది ప్రజల పై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పెట్రో రేట్లు తగ్గించాలని నిరసన చేయడం విడ్డూరంగా ఉంది అని వారున్నారు.

టీడీపీ పగలు బీజేపీ తో, రాత్రుళ్లు కాంగ్రెస్‌తో సంసారం చేస్తోందని ఎద్దేవా చేశారు. లో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పాల్గొంటు౦దని వారు ప్రశ్నించారు.