Home రాజకీయాలు శివాజీ కొత్త కధ షురూ !!

శివాజీ కొత్త కధ షురూ !!

SHARE

మార్చి లో ఆపరేషన్ గరుడ అంటూ భయంగొల్పే ప్రచారం చేసిన నటుడు శివాజీ….తదనంతర కాలం లో డైరెక్ట్ గానే తెదేపాకి సపోర్ట్ పలికి జనాల్లో చుల్కనయ్యాడు…ఇక గరుడ ఆపరేషన్ కధ కూడా తుస్సుమ౦ది. అయితే బాబు ని కాపాడడానికా అన్నట్ట్టు మళ్లీ ఈయనగారు రంగంలోకి దిగారు…ఇప్పుడు కొత్త పాటా అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అట కేంద్రం నోటీసు ఇవ్వబోతోంది అంటూ సాగుతోంది ఆయనగారి కధన౦.

అయితే ఇది ఆపరేషన్ గరుడ లో భాగమే అంటూ…అది మరో రూపం దాల్చిందని శివాజీ అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ని టార్గెట్ చేయటం అంటే రాష్ట్రాన్ని ఇబ్బందిపాలు చేయటం అనేది శివాజీ సార్ అభిప్రాయ౦.

జాతీయస్థాయిలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబు కు నోటీసులు వస్తాయని శివాజీ ఘంటా బజాయించి మరీ చెప్తున్నారు. ఇది తనకి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం అని కూడా శివాజీ అన్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా, తాను ఇలానే చెబుతానని కూడా శివాజీ ముక్తాయించారు. చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విప్పిందని శివాజీ ఉవాచ.

మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఏ విషయంలో నోటీసులో…అక్రమాలకూ సంభందించా లేక పోలవరం అవినీతా లేక అమరావతి బాండ్స్ కి సంబంధించా? వేచి చూద్దాం. అయినా ఇలా పబ్లిక్ గా చెప్పేస్తే జాతీయ పార్టీ ప్లాన్ మార్చుకోవచ్చేమో??