Home రాజకీయాలు మన ముఖ్యమంత్రి నిప్పు శివాజీ…ఎం భయపడొద్దు!!

మన ముఖ్యమంత్రి నిప్పు శివాజీ…ఎం భయపడొద్దు!!

SHARE

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి హీరో శివాజీ విరుచుకు పడ్డారు. ప్రధాని ప్రాణాలు తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ… పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని అన్నారు. వరవరరావు ఈ రోజు కొత్తగా ఏమీ మాట్లాడలేదని… ఇప్పుడు ఇలా ప్రశ్నిస్తున్న వాళ్లందరికీ ‘అర్బన్ నక్సలైట్లు’ అని కొత్త టాగ్ తగిలిస్తున్నారని మండిపడ్డారు. నచ్చని పార్టీ లను అణగదొక్కాలనుకోవడం, నచ్చని ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడం కేంద్రం స్ట్రాటజీ అయిపోయిందని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ…సోమవారం బాబు కి కేంద్రం నోటీసులు ఇవ్వబోతోంది అన్నారు.

ఏపీని నాశనం చేయడమే కాకుండా, ఇక్కడి ప్రాంతీయ పార్టీలు మనుగడలో కూడా లేకుండా చేయాలనుకోవడం దారుణమని శివాజీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసి ఉంటే… రెండు నెలలు, నాలుగు నెలలు లేదా సంవత్సర కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని… ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దాడికి ఏమిటంటూ శివాజీ మండిపడ్డారు.

కేంద్ర౦ తీరుపై తాను ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నానని, ఆంధ్రరాష్ట్రం పై తనకున్న అభిమానమే దానికి కారణమని శివాజీ అన్నారు.

అసలు శివాజీ కి ఏ బెంగా అవసరం లేదు…నిప్పునిప్పు అని ప్రతి నిమిషం గొంతు చించుకుని చెప్పుకునే ముఖ్యమంత్రి కి నోటీసులు వస్తే మాత్రం ఏమిటి…ఎంక్వయిరీ వేస్తే మాత్రం ఏమిటి….ఆయన నిప్పు అయితే నిప్పులో పునీతులై బయటకొస్తారు…అప్పుడు బాబు గారి ఇమేజ్ మోడీ ఇమేజ్ ని మించి ఉంటుంది…శివాజీ గారు…పర్లేదు సార్…నోటీసులు రానివ్వనీయండి!!