Home రాజకీయాలు మరి అదే ఈడీ ని కేంద్రం ఉసిగొల్పితే కదా జగన్ పై ఈ కేసులు?

మరి అదే ఈడీ ని కేంద్రం ఉసిగొల్పితే కదా జగన్ పై ఈ కేసులు?

SHARE

అక్కడికేదో బాబు, కెసిఆర్ జిగరీ దోస్తులన్నట్టు…మోడీ వీరిద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నించారట..ఇది స్వయం గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఆరోపిస్తున్న విషయం.

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తనకి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ రోజు జరిగిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విభజన చట్టంలో ఉన్న ఏ హామీని మోడీ నిలబెట్టుకోలేదని, అలానే తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందని, కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. బీజేపీ పాలనలో ప్రజలకు ఏమి ఒరిగిందని ప్రశ్నించిన బాబు, పెద్దనోట్ల రద్దు వల్ల బ్యాంకు వ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకం పోయిందని విమర్శించారు.

మరి అదే ఈడీ అప్పటి కేంద్రం ఉసిగొల్పితేనే కదా జగన్ పై కేసులు వేసింది?? ప్రజల మధ్య ధైర్యంగా ఆ విషయం ఒప్పుకుంటారా బాబు గారు??