Home రాజకీయాలు డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలు

డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలు

SHARE

చంద్రబాబు అధికారం లోకి రావటానికి డ్వాక్రా రుణ మాఫీ హామీ కూడా ఒకటి. అయితే అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలైనా రుణ మాఫీ జరగలేదని విపక్ష వైకాపా విమర్శిస్తూనే వుంది. అయినప్పటికీ వైకాపా అభివృద్ధి అడ్డంకి అంటూ ప్రతిపక్ష పార్టీ ని వెలివేసినట్టు మాట్లాడ్డమే తప్ప అసలు రుణ మాఫీ జరిగిందా లేదా అన్నది సరిగ్గా ఇప్పటి దాకా తేల్చలేదు.

ఇక ఈ రుణ మాఫీ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రుణ మాఫీ కి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. డ్వాక్రా రుణాల మాఫీ పై లేఖ ద్వారా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని స్వయంగా మంత్రి పరిటాల సునీత లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చార౦టూ 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారని నగరి ఎంఎల్ఏ రోజా చెప్పారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా లేదా అనే ప్రశ్నకు రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానమిచ్చారని కూడా రోజా తన ట్వీట్ లో తెలిపారు.