Home సినిమా రాజమౌళి తనయుడి నిశ్చితార్థం

రాజమౌళి తనయుడి నిశ్చితార్థం

SHARE

ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న దర్శకడు రాజమౌళి త్వరలో తన ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహించనున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. గాయని పూజా ప్రసాద్‌ను కార్తికేయ వివాహమాడనున్నాడు.

కొత్తకాలంగా ప్రేమించుకుంటున్న కార్తికేయ, పూజల వివాహానికి ఇరుకుంటుంబాల పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పూజ సీనియర్‌ నటుడు జగపతిబాబు అన్న రాం ప్రసాద్‌ కుమార్తె. ప్రస్తుతం రాజమౌళి చిత్రాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా, సెకండ్‌ యూనిట్ దర్శకుడిగా ఉన్న కార్తికేయ పలు చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కుటుంబం సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ  ప్రముఖలు హజరయ్యారు.