Home రాజకీయాలు “బాబు వల్ల కాకపోతే ఇసుక మాఫియా నేను అరికడతా!”

“బాబు వల్ల కాకపోతే ఇసుక మాఫియా నేను అరికడతా!”

SHARE

సీఎం చంద్రబాబు ఇసుక మాఫియా అరికట్టడం చేతకాక పోతే కనుక ఆ అధికార౦ తనకివ్వాలని…భాజపా ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు అన్నారు.

ఏపీలో పేట్రేగిపోతున్నఇసుక మాఫియా ను అవకాశమిస్తే తాను నెలరోజుల్లో అరికడతానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ కి టీడీపీ మిత్ర పక్షంగా ఉన్నా కూడా ఇసుక మాఫియాను తాను వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించి గుర్తుచేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. మరో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అనేది అస్సలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కూడా టీడీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికలకి కోట్లాది రూపాయలు సమకూర్చుకోవడం కోసమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇసుకను ఒక ఆదాయ వనరుగా చేసిందని ఆరోపించారు!!