Home రాజకీయాలు అసెంబ్లీ రద్దు నిర్ణయం త్యాగం అట!!

అసెంబ్లీ రద్దు నిర్ణయం త్యాగం అట!!

SHARE

తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం లో నిర్ణయించడం జరిగింది. ఇదే విషయాన్ని గవర్నర్ కు సిఫారస్ చేస్తూ తీర్మానం చేశారు. దీంతో అసెంబ్లీ రద్దు, ఎన్నికలపై సాగుతున్న రూమర్లు సస్పెన్స్ కు తెరపడినట్లయింది.

మంత్రి మండలి తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. ఇక కెసిఆర్ ఈ విషయంపై మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్,టిడిపిలు పాలన చేసినప్పుడు కరెంటు కోతలతో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, పారిశ్రామికవేత్తలు కూడా దర్నాలు చేయటం గుర్తు చేశారు….35 ఏళ్ల సమస్య నించి తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి తెస్తే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పిచ్చి ఆరోపణల వల్ల అదికారులలో స్తైర్యం దెబ్బతింటోందని..అయినా సరే తాము అబివృద్ది ఆగగూడదని భావించామని అన్నారు.

అసలు అసెంబ్లీని రద్దు ద్వారా తాము త్యాగం చేశామని కెసిఆర్ పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు పదవులు వదలుకున్నామని….తమ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇంతటి సాహసం చేసినందుకు తాను సెల్యూట్ చేస్తున్నానని కెసిఆర్ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఎందుకు అసెంబ్లీ రద్దు అని అడగలేదని అన్నారు.

ఏమిటో కెసిఆర్ కూడా సెల్ఫ్ డబ్బా కొట్టడం ఎక్కువైంది ఈ మధ్య…!!