Home రాజకీయాలు యువనేస్తానికి నాలుగున్నర ఏళ్ల తరువాత పచ్చ జెండా…!!

యువనేస్తానికి నాలుగున్నర ఏళ్ల తరువాత పచ్చ జెండా…!!

SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పధకం ద్వారా ఏపీ లో 12.26 లక్షల మంది యువతకి నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి అందించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఈ రోజు సాయంత్రం జరిగిన మంత్రివర్గ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నిరుద్యోగులకు భృతి కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెడుతోన్న ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి అమలు చేయదలచినట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు.

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:
అక్టోబర్ 2 నుంచి యువనేస్తం అమలు
అన్ని మున్సిపాలిటీల్లో బీపీఎస్‌ అమలుకు మంత్రివర్గ ఆమోదం.
పబ్లిక్ హెల్త్ వర్కర్స్‌కు 151 జీవో ప్రకారం వేతనాలు (30 వేల మందికి నెలసరి జీతం రూ. 1000నుంచి 2000 వరకు పెరగనున్నాయి).
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం ఆమోదం.
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ (ఆగస్టు 1 నుంచి ఆక్వా రైతులకు యూనిట్ ధర రూ 2 లెక్కన తీసుకుంటారు).
కరవు సహాయక చర్యల పై శుక్రవారం అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఉద్యోగులకు 3 కరవు భత్యాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కో కరవు భత్యం చెల్లింపునకు రూ.627 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు.
ఇక ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం కోసం 22 నుంచి 35 ఏళ్లలోపు యువతకు నెలకు రూ. 1000 చొప్పున నిరుద్యోగ భృతి అందించనున్నారు. భృతిని నేరుగా బ్యాంక్‌ ఖాతాలలో జమచేస్తారు. 12.26 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 600 కోట్ల చొప్పున పథకానికి ఏడాదికి రూ. 8000 కోట్ల వ్యయ భారం పడనుందని అంచనా.

అయితే నిరుద్యోగ భృతి పథకానికి పచ్చ జెండా ఒప్పందానికి ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టడం బహు శోచనీయం!!