Home రాజకీయాలు ఆంధ్ర అసెంబ్లీ నా లేక తెదేపా ఆఫీసా??

ఆంధ్ర అసెంబ్లీ నా లేక తెదేపా ఆఫీసా??

46
SHARE

మళ్ళీ మామూలే…ప్రధాన ప్రతిపక్షం వైకాపా లేకుండానే మరోసారి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అద్యక్షతన సభా వ్యవహరాల కమిటీ సమావేశం జరిపింది. ఈ నెల పందొమ్మిది వరకు సభ జరుగుతుందని, ఏడు పని దినాలు ఉంటాయని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గత ఏడాది నించి అసెంబ్లీని ప్రదాన ప్రతిపక్ష౦ వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరవైరెండు మంది వైసిపి ఎమ్మల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని, వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయడం లేదని వైకాపా ఆరోపణలు చేస్తున్నది.

ఇక పోతే అసెంబ్లీ ని టీడీపీ ఆఫీసులా మర్చేశారని, అటువంటి సమావేశాలనకు తాము ఎలా వెళ్లాలని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న శాసన సభకు తాము వెళ్లాలా అంటూ ప్రశ్నించారు.

కోడెల 22కేసుల్లో ముద్దాయి అని, అటువంటి వ్యక్తి స్పీకర్‌ కుర్చీలో కూర్చోవటం పెద్ద తప్పని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి సొంత ప్రయోజనం పొందడం తగునా….ఇది తప్పు కాదా అని గోపిరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ కి ఇటువంటి స్పీకర్‌ ఉండడం దురదృష్టకరమని గోపిరెడ్డి వ్యాఖ్యానించారు.