Home రాజకీయాలు జిందాబాద్ ఫిరాయింపు రాజకీయాలు!!

జిందాబాద్ ఫిరాయింపు రాజకీయాలు!!

31
SHARE

తెదేపా అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి పార్టీ పిరాయిస్తే అనర్హత వేటు వేయాలన్న కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని పాటించకుండా వున్నపుడు….ప్రతిపక్షం దానిని నిలదీస్తే….ఆ విషయం పై మాట్లాడకుండా దాన్ని కప్పిపుచ్చి ఇంకేదో మాట్లాడితే తెలుగుదేశం మీడియా అబ్బో అంటూ ఓ గొప్ప విషయం లా ప్రచారం చేయటం ఎంత దౌర్భాగ్యం….ఫిరాయింపుదారులైన ఇరవైరెండు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎప్పటినుండో వైకాపా డిమాండ్ చేస్తూ శాసనసభను కూడా బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఫిరాయింపు కొనుగోళ్ల గురించి అడిగితే…ఇంకేదో చెప్పటం ఏందీ బాబు?

ముఖ్యమంత్రి పరోక్షంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు రాని వారికి జీతాలు ఎందుకు అని ప్రశ్నించటం ఎంత వరకూ సమంజసం. అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకు అని అడగటం….. బాధ్యత మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు.. జీతాలు తీసుకోవడం ఏమిటని విమర్శించారు.

ఎమ్మెల్యే లను కొనడాన్ని ఏమనుకోవాలి…? ఓటుకు నోటు కేసు లో అడ్డగోలుగా దొరికిపోయిన వారిని ఏ రకంగా గౌరవించాలి? ఇంకా పిరాయింపుదారుల పై ఏ రకమైన చర్యా తీసుకోకపోవడం కూడా గొప్ప విషయంగా పరిగణించాలా? వీటిని ఏ రాజకీయాలంటారో? బహుశా 40ఏళ్ల అనుభవం వున్నవారు మాత్రమే చేయగలరేమో ఇటువంటి ఫిరాయింపు రాజకీయాలు.