Home రాజకీయాలు తారక్ మరో సారి జోకర్ మాదిరా?

తారక్ మరో సారి జోకర్ మాదిరా?

60
SHARE

అనుకోని దురదృష్టకర సంఘటన లో నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణం కుటుంబంలో విషాదం నింపింది. అయితే ఈ నేపధ్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పార్టీ కు అనుకూలంగా వ్యూహాత్మకంగా మలచుకోనున్నారా అంటే …అవుననే సమాధానం వస్తుంది.

తాజాగా పరిణామాలతో పార్టీలోకి తారక్ ను తీసుకురావాలన్న ఆలోచన బాబు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో హరికృష్ణ ను బాబు దూరం పెట్టడం జరిగింది…మహానాడుకు కనీసంగా హరికిఁరఃస్నాకి ఆహ్వానం కూడా పంపలేదు. అనేక కారణాల వల్ల….బాబు హరికృష్ణ ల మధ్య దూరం పెరిగిందని అంటారు.

బాబు ‘యూస్ అండ్ త్రో’ వైఖరి హరికృష్ణ ని బాగానే నొప్పించిందట. ఇక అనుకోని పరిణామాల వల్ల హరికృష్ణ మృతి తో విషాదంలో మునిగిన కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి మరీ అంతిమసంస్కారాల్ని నిర్వహించారు. ఇది ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకింత షాకే. ఆయన బ్రతికుండగా ఇవ్వని ప్రాధాన్యత చనిపోయాక ఇవ్వటం చర్చనీయాంశం అయింది. అంత్యక్రియలు బాబే దగ్గరుండి చేయించినట్లు అంటారు.

ఇక అంతటితో ఆగక బాబు తారక్ ను పార్టీ లోకి ఆహ్వానం పలుకుతారనే రూమర్లు రాజకీయ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించటం ద్వారా నందమూరి కుటుంబం తెదేపా ఒకటే అనే భావన ప్రజల్లో వెళ్తుందని అది పార్టీ కి కలిసొచ్చే విషయ౦గా బాబు భావిస్తున్నారట. మరి ఎలెక్షన్లు అయ్యే వరకే ఎన్టీఆర్ అవసరమా లేక ఎలక్షన్ అయ్యాక కూడా ఎన్టీఆర్ కి సముచిత గౌరవం ఇస్తారా లేదా అంటే వేచి చూడాల్సిందే!!