Home రాజకీయాలు అయ్యో జేసీకి ఎంత కష్టమొచ్చింది ?

అయ్యో జేసీకి ఎంత కష్టమొచ్చింది ?

38
SHARE

రాజకీయాలలో సీనియరా లేక జునీవురా కాదు …పవర్ లో వున్నాడా లేదా ఇదే ముఖ్యం. అదికారం లేకపోతే ఎంత సీనియర్ అయినా ఏమి ప్రయోజన౦ ఉండదు. జేసీ నే తీసుకుందాం పాపం అయిన కాడికి కానీ కాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాకా వూదుతూనే వున్నా కూడా జేసీ కి ఏ మాత్రం కలిసొచ్చినట్టు లేదు. అంతేనా నిన్న గాక మొన్నొచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోటీ తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు చౌదరి గారి పై ఫైర్ అవుతున్నారు. అయినా ఫైర్ అవటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత జేసీది.

అనంతపురం లో రోడ్ల వెడల్పు కార్యక్రమాలకు ఎమ్మెల్యే అడ్డుతగులుతున్నాడని జేసీ ఆరోపించారు. అంతేకాక ప్రభాకర్‌ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.

ఆర్కియాలజీకి అప్పగించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే పెత్తనం ఏమిటని కూడా జేసీ ప్రశ్నించారు. మొత్తమ్మీద జేసీ మాన్తా మీదున్నట్టు గా ఉడికిపోతున్నారు. రానున్న రోజుల్లో ఏమౌతుందో వేచి చూద్దాం!!