Home రాజకీయాలు పీతల అక్క సీటుకి ఎర్త్ పెడుతున్నారా?

పీతల అక్క సీటుకి ఎర్త్ పెడుతున్నారా?

50
SHARE

తెదేపా లో పీతల సుజాత అక్కకి మొదట్లో బానే ఉండేది. మంత్రి పదవి…హోదా…అబ్బో ఒకటేమిటి. అక్క అహంకరం పెచ్చు మీరిపోయింది. అయితే తరువాతి కాలంలో…కాబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి పోగొట్టుకుంది.

ఇక ప్రస్తుతమైతే మరీ గడ్డు లా మారింది పీతల సుజాత పరిస్థితి. తన నియోజకవర్గమైన చింతలపూడి టికెట్ కి గట్టి పోటీ ఉండడమే దీనికి కారణం. కాబినెట్ పోస్టు నుండి బర్తరఫ్ అవటం తోటే బాబు ఈవిడగారికిచ్చిన ప్రాధాన్యం కూడా పీకేశారు. ఇక వార్త ఏమిటంటే వచ్చే ఎలక్షన్ కి ఈవిడకి సీట్ దొరకటం దాదాపుగా లేనట్లే. జిల్లా పరిషద్ చైర్మన్ జయరాజ్, తాడేపల్లిగూడెం ఆర్డీఓ విజయరాజు సుజాత కి గట్టిగా పోటీ ఇస్తున్నారు. బాబు కూడా సుజాత కి సీటు ఇవ్వటానికి సుముఖంగా లేరని వార్త…!!ఎంత చెట్టుకి అంత గాలి అనుకోవాలి!