Home రాజకీయాలు ముందస్తు పై మంత్రి లోకేష్!!

ముందస్తు పై మంత్రి లోకేష్!!

158
SHARE

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల కు తాము తమ పార్టీ సిద్ధమే అంటున్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలంగాణ రాజకీయాలు, ఆ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పై స్పందించిన లోకేష్.. మీడియా తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా సిద్ధంగా ఉందన్నారు లోకేష్. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని..119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని లోకేష్ అన్నారు. కొంతమంది నేతలు పార్టీని వీడినా తమ కేడర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. ఇక ఎన్నికల్లో పొత్తుల అంశంపై పొలిట్ బ్యూరో తుది నిర్ణయ౦ తీసుకుంటుంది అన్నారు.

విభజన వల్ల 99 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు లోకేష్. అయినా ఏపీ ప్రభుత్వం కృషితో రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని.. వచ్చే మార్చి నాటికి ఒక్క ఐటీ లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలియజేసారు.