Home రాజకీయాలు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టేనా?

కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టేనా?

29
SHARE

దేశ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యామ్నాయ శక్తి అవుతారు అని రాష్ట్ర ఐటీ పంచాయతీ రాజ్ మంత్రి కెటిఆర్ గారి ఉవాచ. దేశాన్ని ముందుకు నడపడంలో కాంగ్రెస్ మరియూ బిజెపి పార్టీలు రెండూ విఫలం అయ్యాయని కెటిఆర్ అబిప్రాయపడ్డారు.

ప్రధాని మోడీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరక పోవడం వల్ల అలానే కాంగ్రెస్ పై విశ్వాసం లేక పోవటం వల్ల మరో ప్రత్యామ్నాయ శక్తీ అవసరం దేశానికి ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

తెలంగాణలో కెసిఆర్ చేపట్టిన అనేక పధకాలు దేశానికంతటికీ ఆదర్శంగా నిలిచాయని అందుకే దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తోందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. రానున్నఎన్నికలలో తమ పార్టీ పదిహేను లోక్ సభ సీట్లు, 109 అసెంబ్లీ సీట్లు గుళ్ళుతుందని కెటిఆర్ చెప్పారు.