Home రాజకీయాలు అది నోరా అబద్ధాలా ఫ్యాక్టరీనా: జగన్

అది నోరా అబద్ధాలా ఫ్యాక్టరీనా: జగన్

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని మరోసారి విపక్ష నేత వైస్ జగన్ విమర్శించారు. చంద్రబాబుది నోరా అబద్దాల ప్యాక్టరీనా అని జగన్ ప్రశ్నించారు.

గతంలో తమ పార్టీ కి కాంగ్రెస్ కు సంబంధం అంటగట్టారని, ఇక ఇప్పుడు బిజెపితో అంటగడుతున్నారని, అసలు ఆయనది నోరా ,అబద్దాల ప్యాక్టరీనా అని వైకాపా అధినేత ప్రశ్నించారు.

తమ హక్కులు, టిడిపి చేసిన వాగ్దానా లను ప్లకార్డులు ప్రదర్శించి ప్రశ్నించిన ముస్లింల పై దారుణమైన కేసులు పెట్టి జైల్లో వేసింది చాలక, కధలు చెప్తావా అని ముఖ్యమంత్రి ని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము ఓ పక్క పోరాడుతుంటే, ప్యాకేజీ చాలని, హోదా వద్దని బాబు అన్నారని, ఇప్పుడు హోదా అంటూ మళ్ళీ దొంగ దీక్షలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.