Home సినిమా కలవాలని అనుకున్న కానీ..

కలవాలని అనుకున్న కానీ..

42
SHARE

మెగాస్టార్‌ చిరంజీవి ఆయన తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కళ్యాణ్‌ బాబు.. నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకోని విరమించాను. నీకు పట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ హనుమాన్‌, నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను. ఆశీస్సులతో అన్నయ్య, చిరంజీవి’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

చిరంజీవి సందేశాన్ని ఆయన కోడలు ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఆ సందేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి మరో ట్వీట్‌ చేశారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ కూడా సాహసోపేతమైన పారాగ్లైడింగ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ తన బాబాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.