Home సినిమా సై రా లో సుదీప్ లుక్ అదరహో

సై రా లో సుదీప్ లుక్ అదరహో

SHARE

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా నరసింహా రెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యే చిత్ర యూనిట్ ఓ టీజర్ ని కూడా విడుదల చేసారు. ఈటీజర్ రికార్డు లన్ని బ్రేక్ చేసి…ఎక్కువ వ్యూస్ తో ముందుకు దూసుకు పోతోంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, ఇందులో కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రేపు అనగా సెప్టెంబర్ 2 ఆదివారం సుదీప్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని ‘సైరా’లో ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘‘మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా నరసింహారెడ్డిలోని ‘అవుకురాజు’ డైనమిక్‌ లుక్‌ మీకోసం’’ అంటూ నిర్మాతలు లుక్ ని రిలీజ్ చేశారు.

నిజంగానే ఎంత డైనమిజం ఒలకపోస్తున్నాడో కదా అవుకురాజు…కాదు కాడి సుదీప్?