Home రాజకీయాలు ప్రధాని నివాసంలో లగ్జరీ కార్ల వేలం

ప్రధాని నివాసంలో లగ్జరీ కార్ల వేలం

35
SHARE

పాకిస్తాన్‌ నూతన ప్రధాని గా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణం చేసి౦ది మొదలు ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు. పీ ఎం గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీఐపీ సాంప్రదాయానికి చరమగీతం పాడి సరి కొత్త పాకిస్తాన్ ని నిర్మిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక దాన్లో భాగమే ఈ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లను వేలానికి ఉంచాలన్ననిర్ణయ౦.

దీని ప్రకారం సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నివాసంలో వేలం జరగనుంది. వేలం లో ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు ఉండబోతున్నాయి. వీటిలో 2014 మోడల్‌కు చెందినవి మూడు, 5000సీసీ ఎస్‌యూవీలు మూడు, 3000సీసీ ఎస్‌యూవీ 2016 మోడల్‌ కార్లు రెండు ఉన్నట్లు పాక్ పత్రిక డాన్‌ వెల్లడించింది. వీటితో పాటు 2016 మోడల్‌కు చెందిన నాలుగు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను కూడా వేలం వేయనున్నారు. తద్వారా వచ్చిన ధనాన్ని పీఎం ఫండ్ కి ఇస్తారు!!