Home రాజకీయాలు మోడీ ఓ పెద్ద బ్రోకర్ సిపీఐ నేత తీవ్ర వ్యాఖ్యలు

మోడీ ఓ పెద్ద బ్రోకర్ సిపీఐ నేత తీవ్ర వ్యాఖ్యలు

SHARE

ప్రధాని నరేంద్ర మోదీని ఆయనో పెద్ద బ్రోకర్ అ౦టూ సీపీఐ ఏపీ రాష్ట్ర నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా తో ఈ రోజు మాట్లాడిన ఆయన ఢిల్లీలో పనులున్న వాళ్లు ఆర్ఎస్ఎస్ నేతలకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారని, కార్పొరేట్ బ్రోకర్లను మోదీ తనతో విదేశాలకు తీసుకెళుతున్నారని, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణానికి కూడా మోదీయే కారణమ౦టూ ఆరోపించారు.

మోదీ పాలనలో లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్ మనీగా మారిందని, ఏపీకి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ కూడా కేంద్రం అమలు చేసిన పాపాన పోలేదని రామకృష్ణ దుయ్యబట్టారు.