Home రాజకీయాలు బీజెపీతో మసిలినంత కాలం బాబుకి స్టేటస్ అన్న మాటే గుర్తు లేదు

బీజెపీతో మసిలినంత కాలం బాబుకి స్టేటస్ అన్న మాటే గుర్తు లేదు

113
SHARE

ఆంద్ర్హ ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు దగ్గర దగ్గర నాలుగున్నర సంవత్సరాలుగా బీజేపీ తో కలిసి సంసారం చేశారని అలా ఉన్నన్నాళ్లూ బాబుకు హోదా అనే మాటే గుర్తు రాలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.

విశాఖపట్ణణం జిల్లా చోడవరంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ధర్మ పోరాట దీక్షలు అంటూ నాటకాలాడుతున్నారని, ఆనాడే కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చి ఉంటే ప్రత్యేకహోదా వచ్చేదా …కాదా? అని జగన్ ప్రశ్నించారు.

నర్సీపట్నం-భీమిలి రోడ్డు విస్తరణను అసలు పట్టించుకునే నాథుడు లేడని, బాబు పాలనలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, కేజీ ఉల్లిని 4 రూపాయలకు కొని హెరిటేజ్ లో 25రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు.

ప్రజలని ఆదుకోవాల్సిన సీఎం దళారీగా మారిపోయారని, బాబు పాలనలో విద్యార్థుల ఫీజులు విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు. బాబు బినామీ కార్పొరేట్ కాళాశాలల్లో ఇంటర్ చదవడానికి ఏడాదికి రూ.లక్షా అరవై వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బాబు స్వహస్తాలతో దగ్గరుండి మరీ నిర్వీర్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ మాత్రం జరగడం లేదని అన్నారు.

చంద్రబాబు పాలన అవినీతిమయ౦ అయిపోయిందని తాళ్లపూడి, పెదమదీనాలో ప్రభుత్వ భూములు కూడ వదిలి పెట్టలేదని, రూ.54 కోట్ల విలువైన 134 ఎకరాలను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. జేసీ అగ్రహారంలో 412 ఎకరాలను స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ఇసుక ఫ్రీ అని అంటూనే 2 యూనిట్ల ఇసుకను 16 వేలకు అమ్ముతున్నారని, నీరు-చెట్టు కింద పనులు చేసినట్లు చూపుతూ డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు.