Home రాజకీయాలు హోదా కోసం మరో యువకుడి ప్రాణ త్యాగం: జగన్ దిగ్భ్రా౦తి!

హోదా కోసం మరో యువకుడి ప్రాణ త్యాగం: జగన్ దిగ్భ్రా౦తి!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ప్రాణత్యాగం చేశాడు. రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ దగ్గర ఉన్న ఓ సెల్ టవర్ కు త్రినాధ్ ఉరేసుకున్నాడు.

ఘటనా స్థలం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాను ఈ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు త్రినాథ్ ఆ నోట్ లో పేర్కొనడం గమనార్హం.
‘అయ్యా, సీఎం గారు, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే, నా మరణానికి ఒక అర్థం..’ అని త్రినాథ్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

త్రినాథ్ ఆత్మహత్య ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందామని, ప్రాణత్యాగాలకు మాత్రం ఎవరూ పాల్పడవద్దని పిలుపునిచ్చారు.