Home రాజకీయాలు ఎన్టీఆర్ కి పొలిట్ బ్యూరో పదవి…ఎస్ ఆర్ నో

ఎన్టీఆర్ కి పొలిట్ బ్యూరో పదవి…ఎస్ ఆర్ నో

SHARE

హరికృష్ణ మరణానంతరం తెదేపా లో కొత్త చర్చ ప్రారంభం అయింది. హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ కు టీడీపీలో పొలిట్ బ్యూరో పదవి ఇవ్వాల౦టూ డిమాండ్ మొదలైంది. ఈ విషయం పై కొంత మంది నేతలు చర్చ మొదలు పెట్టారట….ఇక త్వరలోనే డిమాండ్ ను లేవనెత్తే అవకాశం లేక పోలేదని సమాచారం.

హరికృష్ణ ఇటీవల వరకూ కూడా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. కాకపోతే పార్టీ కార్యక్రమాల్లో ఈ మధ్య కాలం లో అంతగా ఆయన చురుగ్గా పాల్గొనలేదు. కారణం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హరికృష్ణ ను దూరంగా పెట్టడమే. పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవటం హరికృష్ణను ఎంతో బాధించిందని చెబుతారు. ఎన్టీఆర్ మరో కుమారుడు బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు, ముఖ్యమంత్రి అయినా చంద్రబాబునాయుడు తన తనయుడు నారా లోకేష్ కి అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, ఐటి శాఖలు కట్టపెట్టారు. ఎటు కాకుండా హరికృష్ణ ఫ్యామిలీ కి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారంటారు.

అప్పట్లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కు అధికార౦ మార్చటానికి హరికృష్ణ తన తండ్రిని సైతం ఎదిరించి బాబు ను సపోర్ట్ చేయటం బాబుకు బాగా కలిసొచ్చింది. తొలుత మంత్రి పదవి ఇచ్చినా కానీ క్రమ క్రమంగా హరికృష్ణను దూరం పెడుతూ వచ్చారు.

హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా చంద్రబాబు ఓ దఫా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకుని..ఆయనను కూడా పక్కనపెట్టేశారు. అంతే కాదు..నారా లోకేష్ వంటి వారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పై వ్యంగ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హావభావాల ప్రదర్శనలో కానివ్వండి..స్పీచ్ లో కానివ్వండి ఎన్టీఆర్ ముందు నారా లోకేష్ నిలబడలేరు. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను దూరం పెట్టారు.

ప్రస్తుతమైతే బాబు, లోకేష్ ల హవా నే పార్టీ అంతా మరి హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఎన్టీఆర్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలనే డిమాండ్ కి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే!!