Home రాజకీయాలు ఇదే౦ పోయేకాలంర బై …హరికృష్ణ గారి బాడీ తో సెల్ఫీ నా ?

ఇదే౦ పోయేకాలంర బై …హరికృష్ణ గారి బాడీ తో సెల్ఫీ నా ?

40
SHARE

ఈ సెల్ఫీ ల పిచ్చి ఏ మోతాదు లో ఉందంటే…కొడుకు ప్రాణం పోతున్న పట్టించుకోకుండా మైమరపులో తల్లి దండ్రులు…ఇక మొన్న నందమూరి హరికృష్ణ ఆక్సిడెంట్ లో దుర్మరణం పాలైన విష్యం తెలిసిందే. హరికృష్ణ ని నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ కి అత్యవసర వైద్యానికోసం తరలించారు. డాక్టర్లు పోరాడినప్పటికీ హరికృష్ణ ప్రాణం కాపాడలేకపోయారు.

ఇదిలా ఉండగా హాస్పిటల్ లో పని చేస్తున్న నర్సింగ్ స్టాఫ్ ఆయన మృతదేహం తో సెల్ఫీ లు దిగి అవి వాట్సాప్ లో షేర్ చేసుకోవటం కలకలం సృష్టించింది. సభ్య సమాజం ఎటు పోతోందా అన్న ప్రశ్న ఒకసారి ఉత్పన్నమైంది.

కామినేని హాస్పిటల్ వారిని ఉద్యోగం నించి పంపించేసింది. అయితే దాని కన్నా ముఖ్యం చనిపోతున్న విలువలు …వీటికి ప్రాణం పోయాలి …మానవత్వ విలువలు బ్రతకాలి. ఎలా అంటే జవాబు కష్టమే కానీ ఇలాంటి వార్త చదివిన ఒక్కరికైనా (రాస్తున్న నాతొ కలుపుకుని) చివ్వుక్కుమని మనస్సాక్షిని చరిస్తే వారు మారవచ్చని..ఆశిద్దాం!!