Home రాజకీయాలు రుణ మాఫీ కాదు…పచ్చదనం మాఫీ చేస్తున్న బాబు తీరు!!

రుణ మాఫీ కాదు…పచ్చదనం మాఫీ చేస్తున్న బాబు తీరు!!

SHARE

ఎర్రచందన౦ సరఫరాలో అక్రమాలౌతున్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఎర్రచందనం పతంజలి సంస్థ కు తక్కువ ధరకు ప్రభుత్వం అమ్ముతోందని భూమన ఆరోపించారు. మంచి గ్రేడ్ ఎర్రచందనాన్ని కూడా ప్రభుత్వం గ్రేడ్ తక్కువగా చూపించి తక్కువ ధరకు అమ్ముతున్నదని భూమన అన్నారు.

ఈ సందర్భం బాబు గతంలో అన్న మాటలు గుర్తుచేసి ముఖ్యమంత్రి ఎర్రచందనం ద్వారా వచ్చే డబ్బుతో రైతుల రుణమాఫీ చేస్తా౦ అన్నారని, అయితే కనీసం ఒక్క రూపాయి కూడా ఎర్రచందనం డబ్బుతో రుణమాఫీ జరిగింది లేదని కానీ అడవుల్లో ఉన్న పచ్చదన౦ మాత్రం మొత్తం మాఫీ చేస్తున్నారని భూమన విమర్శించారు.

35 లక్షల ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందన౦ పచ్చదండు అక్రమాల పాలౌతోందని ధ్వజమెత్తారు. అసలు ఎర్రచందనం వేలం ద్వారా ఎంత వచ్చిందీ అది ఏమైందని భూమన ప్రశ్నించారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు పతంజలి సంస్థకు సరఫరా చేస్తున్న సీ గ్రేడ్‌ ఎర్రచందనాన్ని పట్టుకుంటే అది ఏ గ్రేడ్‌గా తేలిందని మండిపడ్డారు.