Home ప్రత్యేకం బాబు ప్రభుత్వం హరికృష్ణ కోసం ఏమైనా చేస్తుందా??

బాబు ప్రభుత్వం హరికృష్ణ కోసం ఏమైనా చేస్తుందా??

84
SHARE

తె.ప్రభుత్వం నిజంగా గ్రేట్…హరికృష్ణ స్మారక చిహ్నం ప్రభుత్వ ఖర్చుతో అట. దివంగత నందమూరి హరికృష్ణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సత్వర నిర్ణయాలు ఎన్టీఆర్ హరికృష్ణ అభిమానులకి ఎంతో ఊరట ఇచ్చాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటం ఒకటైతే, రెండోది హరికృష్ణ కి స్మారక చిహ్నం చేస్తామని అనటం. ఈ మేరకు తలసాని ప్రకటన చేసారు.

అంత్యక్రియలు అధికారికంగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించగా, ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేకంగా స్థలాన్నికూడా కేటాయించటం చాలా ముదావహం. హరికృష్ణ కుటుంబసభ్యులని సంప్రదించి వారి నిర్ణయం మేరకు ఈ స్మారక చిహ్నం నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. మహాప్రస్థానంలోనే హరికృష్ణ స్మారక స్థూపం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

విశేషమేమిటంటే ఈ స్మారక చిహ్నానికి కావలసిన 450 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఖర్చుతోనే హరికృష్ణ స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. హరికృష్ణ జయంతి, వర్థంతి సందర్భాల్లో కుటుంబసభ్యులు నివాళి అర్పించుకునే విధంగా వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. మరి బాబు ప్రభుత్వం హరికృష్ణ కోసం ఏమైనా చేస్తుందా అంటే అనుమానమే…ఒకవేళ ఇప్పుడు అనౌన్స్ చేసినా అది బాబు కెసిఆర్ ని ఫాలో అయినట్లే!!