Home రాజకీయాలు హరికృష్ణ భౌతికకాయం ఎన్టీఆర్ భవన్ కి ఎందుకు రాలేదు?

హరికృష్ణ భౌతికకాయం ఎన్టీఆర్ భవన్ కి ఎందుకు రాలేదు?

57
SHARE

ప్రముఖ నటుడు, సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే కదా. అయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించింది. అభిమానులు, రాజకీయ మిత్రులు హారికృష్ణ కి ఘనంగా వీడ్కోలు పలికారు.

హరికృష్ణ చితికి ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ నిప్పు అంటించారు.జూబ్లిహిల్స్ లోని మహాప్రస్తానంలో ఈ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ సుప్రింకోర్టు జడ్జి చలమేశ్వర్ ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుటుంబీకులు, అబిమానులు అంతిమ నివాళి అర్పించారు.

అయితే చంద్రబాబు సహా టీడీపీ వారు కోరినా హరికృష్ణ పార్థివ దేహాన్ని ఎన్.టి.ఆర్. ట్రస్టు భవన్ కు తీసుకువెళ్ళడానికి హరికృష్ణ కుటుంబ సభ్యులు ససేమిరా అంగీకరించలేదన్నారట. అయితే ఎందుకు హరికృష్ణ కుటుంబసభ్యులు ఇష్టపడలేదో తెలియవలసి ఉంది. డైరెక్ట్ గా జూబిలీ హిల్స్ మహాప్రస్తానానికే తీసుకువెళ్లారు.

ఇలా ఉంటే హరికృష్ణ స్మారకం ఏర్పాటు చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ప్రకటించారు. ఇది హర్షణీయం!!