Home రాజకీయాలు ఉండవల్లి లో ‘హై టెన్షన్’

ఉండవల్లి లో ‘హై టెన్షన్’

SHARE

నిజంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ముహుర్తాన అయితే ఏ పార్టీ వారితో చర్చలు జరపకుండా ఎవ్వరి సూచనలు తీసుకోకుండా రాజధాని స్థల౦ అయిన అమరావతిని ఎంపిక చేశారోగాని, అప్పటినుంచి ఒకటా రెండా అన్నీ వివాదాలే. అమరావతి అంటే వివాదాలన్న చందంగా తయారైంది!

ఇక తాజాగా ఉండవల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కారణం…రైతుల అనుమతి లేకుండా హైటెన్షన్ కరెంట్ లైన్ లు ఏర్పాటు చేయటం పై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబందిత CRDAఅధికారులను వారు అడ్డుకోవటం జరిగింది. ఇక రైతులని అడ్డుకోవటానికి ప్రభుత్వం పోలీసులను పెద్ద ఎత్తున రంగం లోకి దింపి౦ది.

పోలీస్ లు పలువురు రైతులను అరెస్టు చేశారు..వారికి పోలీసుల కు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. హై టెన్షన్‌ లైన్‌ ల ఏర్పాటుకు వ్యతిరేకంగా కొంత మంది రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్‌ లు చేశారు.