Home రాజకీయాలు నందమూరి హరికృష్ణ దుర్మరణం

నందమూరి హరికృష్ణ దుర్మరణం

SHARE

ఎన్టీఆర్‌ కుమారుడు, హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద  ఈ రోడ్డు ప్రమాదం జరిగిం‍ది.  కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు.

గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

నందమూరి హరికృష్ణ వయస్సు 61 సంవత్సరాలు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా, మొండితనం నిండిన వ్యక్తిత్వంతో ఆయన నందమూరి వారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.