Home రాజకీయాలు ఫిరాయింపు ఎం ఎల్ ఏ కారు డీ కొని దంపతులు మృతి

ఫిరాయింపు ఎం ఎల్ ఏ కారు డీ కొని దంపతులు మృతి

SHARE

ఇంకో దుర్ఘటన. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పోతుల రామారావు కారు డీకొన్న ప్రమాదంలో ఇద్దరు దంపతులు కన్నుమూశారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే అయినా పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణిస్తుండగా కేసరపల్లి వద్ద ప్రమాదం జరిగింది.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరినారాయణరెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులను వేగంగా వెళ్తున్న ఎమ్మెల్యే వాహనం ఢీ కొనగా స్కూటీ పల్టీలు కొట్టి డివైడర్ పైన పడింది. దానిపై ప్రయాణిస్తున్న సీతామహాలక్ష్మీ అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా, భర్త నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కారు అతివేగంగా నడపడం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎం ఎల్ ఏ రామారావు ఆటోలో ఎక్కించి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. పోతుల రామారావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొంది తరువాతి రోజులలో తెలుగుదేశంలోకి పిరాయించినవారు.