Home రాజకీయాలు ప్రాణాలు తోడేసిన తేయీస్…23!!

ప్రాణాలు తోడేసిన తేయీస్…23!!

SHARE

స్నేహితులతో కలిసి కారు లో మరో స్నేహితుడ్ని కలవటానికి నెల్లూరు వెళ్తూ ఆక్సిడెంట్ లో నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే.

కారు నడుపుతున్న హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం ద్రుష్టి మరల్చటం, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం ఆక్సిడెంట్ కి కారణంగా చెప్తున్నారు. ఆక్సిడెంట్ ధాటికి హరికృష్ణ కార్ లోంచి ఎగిరి రోడ్ పై పడటం వల్ల తలకి తీవ్రమైన గాయమై౦ది. డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ ఆయనను మృత్యువు నుంచి కాపాడలేకపోయారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులూ కొద్ది పాటి గాయాలతో బయట పడ్డారు.

దురదృష్టకరమైన విషయమేమిటంటే నాలుగు సంవత్సరాల క్రిందట హరికృష్ణ తన పెద్ద కుమారుడు జానకిరామ్ ని ఇదే రోడ్డుపై ఆక్సిడెంట్ లోనే పోగొట్టుకున్నారు. అంతకన్నా దురదృష్టమేమిటంటే జానకిరామ్ డ్రైవ్ చేసిన కారు నంబరు హరికృష్ణ డ్రైవ్ చేసిన కారు నంబరు ఒకటే కావటం. 2323నంబరు కలిగిన కార్లు ఇద్దరి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి.