Home రాజకీయాలు ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే!!

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే!!

SHARE

కర్నూలు జిల్లా రైతు దంపతుల ఆత్మహత్య హృదయాన్ని కలచి వేసే సంఘటనే….రుణమాఫీ అనేది ఎంత మోసపూరిత హామీనో చెప్పకనే చెప్పే ఘటన. రైతు రామయ్య దంపతులు అప్పుల బాధ తాళలేక…రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్ర‌భుత్వంపై ఆగ్రహం వెళ్లగక్కారు. రామయ్య దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ ఆరోపించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణమాఫీ కాకపోవడంతో తాను తీసుకున్న అప్పుకు బ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో దిక్కుతోచని రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రోజా తెలిపారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడు గ్రామానికి చెందిన రామయ్య దంపుతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని రోజా అన్నారు.

చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయిని రోజా విమర్శించారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. ఈ గ్యారేజ్‌ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని రోజా స్పష్టం చేశారు.