Home రాజకీయాలు మోహన్ బాబు కి ఆయన్ని సీఎంగా చూడాలను౦దట…

మోహన్ బాబు కి ఆయన్ని సీఎంగా చూడాలను౦దట…

SHARE

డి.ఎమ్.కె. సారద్యం వహించబోతున్న స్టాలిన్ ను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని అభిలషిస్తున్నట్లు ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు డైలాగ్ కింగ్ ఓ ట్వీట్ చేశారు కూడా.

కోయంబత్తూరులో జరిగిన కరుణానిది సంతాప సభ లో తాను మాట్లాడిన విషయాన్ని మోహన్ బాబు తన ట్వీట్ లో ప్రస్తావించి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఆహ్వానం తోనే తాను సంస్మరణ సభలో పాల్గొన్నట్టు చెప్పారు.

ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలు కూడా తెలియచేసారు మోహన్ బాబు. స్టాలిన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవర్ని చూడాలని ఉందండీ??