Home ప్రత్యేకం నూడిటీ సృజనాత్మకత ఏంట్రా బాబు?

నూడిటీ సృజనాత్మకత ఏంట్రా బాబు?

SHARE

ఓ ఫొటోగ్రాఫర్ అందరికన్నా విబ్భినంగా ఫోటోలు తీయాలనుకుని తన క్రియేటివిటీ కి పదునుపెట్టాడు. ఒక మోడల్‌ ని ఎంచుకుని ఆమె కు పేద్ద…బొట్టు పెట్టి బెంగాలి పెండ్లి కుమార్తె లా తయారు చేసాడు…అంతటితో ఆగదా…ఉహూ…ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నూడ్ గా తయారు చేసి ఫొటో తీసి..ఫేస్‌బుక్‌ లో పెట్టాడు. ఇంకేముంది …అది కాస్తా వైరల్‌ అయ్యి బెంగాళీలు ఫొటోగ్రాఫర్‌ పై విరుచుకుపడేంత కోపం తెప్పించింది ……ఈ ఫోటోగ్రాఫర్ ని చంపేస్తామని బెదిరి౦చేంత దాకా తెచ్చింది..!

కోల్‌కతా ఫోటోగ్రాఫర్ ప్రీతమ్‌ మిత్రాకు వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ గా ఎంతో మంచి పేరు వుంది…అయితే ఇంకేదో సృజనాత్మకత అనుకుంటూ ఎక్కువ పాపులారిటీ కోసం అర్రులుచాపి వెరైటీ ఫొటో‌షూట్ అంటూ మోడల్‌ పెళ్లి కుమార్తెలా ఓ న్యూడ్ ఫొటో తీశాడు. చిత్రంలో మోడల్ మొహమూ వక్షోజాలు కనపడకుండా తమలపాకులు, జుట్టు తో కవర్ చేశాడు.

కానీ ఓ పెండ్లి కుమార్తె ని ఇంత దరిద్రంగా చిత్రీకరిస్తావా అని బెంగాళీ నెటిజన్లు ప్రీతమ్ పై మండిపడుతున్నారు. బెంగాలీ వివాహ వ్యవస్థ, అలానే హిందువులను అవమాన పరిచేలా ఈ చిత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు 24 గంటల్లో ఫొటో తొలగించనట్లైతే చంపేస్తామని పీత్రమ్‌ ను హెచ్చరించారు. ఈ ఫొటో వల్ల ప్రీతమ్ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది….!!

ఇండియా లో ఉంటూ నూడిటీ ఒక సృజనాత్మకత అంటే తంత్తారా నాయనా!!