Home రాజకీయాలు ఏపీ లో కాంగ్రెస్ తో పొత్తు నహీ…అంటే తెలంగాణలో హై..!!

ఏపీ లో కాంగ్రెస్ తో పొత్తు నహీ…అంటే తెలంగాణలో హై..!!

SHARE

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పై తెదేపా స్టేట్మెంట్లు అసలు ఊహకందనివి. ఎప్పటికప్పుడు ప్రజలని మభ్య పెట్టిస్తూ క్లారిటీ అనేది లేకుండా పొత్తులు గురించి ఒక్కో తెదేపా నేత ఒక్కో లా..!

ఇక తాజా గా కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాదిన ఆయన తెదేపా జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఎలా ఉన్నప్పటికీ ఏపీ లో మాత్రం కాంగ్రెస్ తో ఖచ్చితంగా పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ తో పొత్తు ఉండద౦టూ కేఈ చేసిన వ్యాఖ్యల పై ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు కూడా దానిపైన కేఈ స్పందిస్తూ, వర్ల ఎవరు తనకు చెప్పడానికంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులో నాటుకుపోయిందని, పైగా కింది స్థాయి కేడర్ల నుంచి వెలువడిన అభిప్రాయాలు మాత్రమే తాను వెల్లడించానని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తనను మందలించారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కూడా అన్నారు.

ఇక్కడ కేఈ వ్యాఖ్యలు లో మర్మం చూడొచ్చు …వేరే రాష్ట్రాల్లో ఎలా ఉన్నప్పటికీ ఆంధ్ర లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు అనటం పై అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇది ఓ రకంగా తెలంగాణ లో తమ పొత్తు కాంగ్రెస్ తోనే అని చెప్పినట్టు కూడా అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. కాంగ్రెస్ తో పొత్తు కోసమే కదా రేవంత్ ని కాంగ్రెస్ కి పంపింది అంటూ ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏమైనా….ఈ విషయాన్ని రెండు మూడు నెలలు ప్రజల్లో లీక్ లిచ్చి అప్పుడు బాబు ఓ నిర్ణయానికి వస్తాడు.