Home రాజకీయాలు తెలంగాణలో ముందస్తు బాబుకి కలిసొచ్చే విషయమా?

తెలంగాణలో ముందస్తు బాబుకి కలిసొచ్చే విషయమా?

139
SHARE

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అంటే…అవుననే మాట వినిపిస్తోంది. అయితే అదే నిజమైతే ఎన్నికలలో ఏపి ముఖ్యమంత్రి, తెదేపా అదినేత చంద్రబాబునాయుడు ఎలాంటి పాత్ర పోషిస్తారు అన్న
విషయమై భిన్న కధనాలు ప్రచారంలోకొస్తున్నాయి.

తెలంగాణలో తెరాసా ను ఇరుకున పెట్టడానికి బాబుకి ఇదే మంచి అవకాశ౦. అయితే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న విషయం….ఆ రాష్ట్రం లో దరిదాపుగా ముప్పై నుంచి నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా కి క్యాడర్ బలముంది.

బాబు ఈ నియోజకవర్గాల్లో కనక ప్రచారానికి వెళ్తే జవసత్వాలు సన్నగిల్లిన పార్టీ కి నూతన ఉత్సాహం ఇచ్చినవారౌతారు, పార్టీ కి కొంత అండ ఉన్నట్టు ఉంటుంది…అదే చేత్తో బాబు కొంత దనం వెచ్చించి ఈ నియోజకవర్గాల్లో కొంతమందిని అయినా గెలిపించుకుంటే పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది.

అయితే ఏపీ…తెలంగాణ లలో ఎన్నికలు ఒకేసారి ఉంటే మాత్రం బాబుకి కష్టమే రెండు రాష్ట్రాల్లో డబ్బు సమకూర్చడం, ప్రచారంపై దృష్టి పెట్డం అంత ఈజీ కాదు.. ఇంకొంతమ౦ది తెలంగాణ లో బాబొస్తే ఓటుకు నోటు కేసు తెర పైకి మళ్ళీ రావచ్చన్న సందేహం కూడా వెలిబుచ్చుతున్నారు…చూద్దాం బాబు ఎలా రాజకీయం నెరపుతాడో!!