Home రాజకీయాలు కంటివెలుగు…భాజపా సెటైర్

కంటివెలుగు…భాజపా సెటైర్

148
SHARE

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేబూనిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం ఎంతగానో ప్రాచుర్యం తెప్పిస్తోంది. ఉచితంగా కంటి పరీక్షా మరియు అవసరమైనవారికి ఉచితంగా చికిత్స, కళ్లజోళ్లు పంపకం…కంటి వెలుగు కార్యక్రమాన్ని తెరాసా ప్రచార౦ చేయటం మిగిలిన రాజకీయ పార్టీలకు కొంత నష్టమే.

అయితే ఈ స్కీం పై బిజెపి చిత్రమైన విమర్శ చేసింది. భాజపా అదికార ప్రతినిది శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని బేఖాతరు చేస్తూ తెరాసా ముందస్తు ఎన్నికల హడావుడి చేస్తోందని కొడుక్కి అధికారం కట్టపెట్టె దిశగానే కెసిఆర్ ఆలోచనలు సాగుతున్నాయని విమర్శించారు.

అలానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ కి వెళ్లి తన కంటికి వైద్యం చేయించుకున్నారు కానీ ప్రజలు కనీసం ఉస్మానియా ఆసుపత్రికి కూడా రావడానికి వీలు లేదా అని ఆయన ప్రశ్నించారు.

పండుగలకు పబ్బాలకు, ఇఫ్తార్‌ విందులకు వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వానికి ఆసుపత్రులకు డబ్బులు కేటాయించడానికి చేతులు రావడం లేదా అన్నారు. ప్రగతి నివేదన సభకైతే 200 కోట్లు ఖర్చు పెట్టె ప్రభుత్వం అందులో పది శాతం కూడా ఉస్మానియా ఆసుపత్రికి కేటాయించలేకపోతోందని ఎద్దేవా చేశారు. అలానే కేసీఆర్ సామాజిక వర్గానికె చెందిన కార్పొరేట్‌ ఆసుపత్రుల యజమాని మాత్రం ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారని గుర్తు చేశారు.