Home రాజకీయాలు ఏపీ రాజకీయాలలో మరో కుంపటి!

ఏపీ రాజకీయాలలో మరో కుంపటి!

SHARE

సాధారణ ఎన్నికలకు ఇంకొన్ని నెలలు మాత్రమే వుంది. రాజకీయ పార్టీ లు ఎన్నికలకి సన్నద్ధం కావటానికి తాము అనుసరించవలసిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ టైం లో తాను ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు ఆమె చెప్పారు. గీత వైకాపా పై ఎంపీ గా గెలిచి…ఆ పార్టీ నించి దూరం అయ్యారు… తెదేపా లోకి జంప్ అవుతారన్న ప్రచారాన్ని తోసిరాజని …..ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అసలు రాజకీయాలలో వున్నారా అని అనుకొంటున్న సందర్భంలో గత కొంతకాలంగా తటస్థంగా ఉండిపోయారు.

ఇక రూమర్లు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కొత్తపల్లి గీత ప్రకటించారు. శతకోటి లింగాల్లో బోడిలింగమా లేక ఏమైనా విషయముంటుందా అంటే…వేచి చూడాల్సిందే మరి!!