Home రాజకీయాలు ఏపీ బాండ్ల వెనుక అవినీతి….గవర్నరు కి ఫిర్యాదు

ఏపీ బాండ్ల వెనుక అవినీతి….గవర్నరు కి ఫిర్యాదు

98
SHARE

అమరావతి బాండ్ల వెనుక భారీ అవినీతి నిధులు దోపిడీకి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏపీ బీజేపీ విమర్శించింది. ఈ మేరకు విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను భాజపా నేతలు కలిసి ఫిర్యాదు కూడా చేశారు.

విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని వారు గవర్నరును అడిగారు. దేశంలో మరెక్కడా లేని చందంగా 54 వేల పీడీ అకౌంట్లు తెరిచి చంద్రబాబు సర్కారు భారీగా నిధులు పక్కదారి పట్టించిందని గవర్నర్ కు అందించిన లేఖలో వారు పేర్కొన్నారు.

సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో బాజపా నేతలు చర్చించారు. ఈ అంశాన్ని నిశితంగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని గవర్నర్‌ కూడా వ్యక్తపరిచినట్లు బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబర్‌లో భోగాపురం, ఓర్వకల్లు, నెల్లూరులో గ్రీన్‌ఫీల్డ్‌‌ విమానాశ్రయాలు నిర్మించేందుకు అనుమతులు ఇస్తే ఇంతవరకూ చేపట్టకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అమసర్ధత తెలియచేస్తోందన్నారు. ఈ జాప్యం కేవలం అవినీతికి ప్రణాళికలు వేసుకోవడానికే అనే భావన కలుగుతోందని సోము వీర్రాజు దుయ్యబట్టారు.