Home సినిమా తెలుగు ఇండస్ట్రీ పై శ్రీరెడ్డి తాజా సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఇండస్ట్రీ పై శ్రీరెడ్డి తాజా సంచలన వ్యాఖ్యలు

SHARE

శ్రీ రెడ్డి పేరు తెలియని సినీ అభిమాని వుండరు. నటన ద్వారా కంటే వివాదావల్లే ఈమె ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ స్టార్ట్ పెట్టిన శ్రీ రెడ్డి అటు పిమ్మట కొందమంది పర్సనల్ లైఫ్ లోకి చొచ్చుకెళ్లిపోయి రచ్చ రచ్చ చేసింది.

తెలుగు ఇండస్ట్రీ లో కావలసినంత రచ్చ చేసి ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి అక్కడా రచ్చ చేసింది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ పలువురి ఫై అసహ్యకరమైన ఆరోపణలు చేసింది.

తాజాగా చెన్నైలో ఓ ప్రెస్ మీట్ పెట్టిన చేసిన శ్రీరెడ్డి మరో సారి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలలో కెల్లా టాలీవుడ్ ఏ చెడ్డద౦టు షాకింగ్ కామెంట్స్ చేసింది. కేవలం నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఇండస్ట్రీ ఉందని తీవ్రస్థాయి లో ఆరోపించింది. తెలుగు ప్రేక్షకులు పెగ్గు హీరోల చిత్రాలు మాత్రమే చూస్తారని తెలిపింది. ఈ నాలుగు కుటుంబాల కనుసన్నల్లోనే మొత్తం తెలుగు ఇండస్ట్రీ నడుస్తోందని, ఇండస్ట్రీ లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. అందుకే టాలీవుడ్ అంత చెడ్డ ఇండస్ట్రీ మరోకటి లేదని వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తనకి చేతినిండా సినిమాలున్నాయని `రెడ్డి డైరీ`తో సహా మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పానని తెలిపింది.