Home రాజకీయాలు భోగాపురం బోగస్ టెండర్ పై సిబిఐ విచారణకు బాబు రెడీ నా?

భోగాపురం బోగస్ టెండర్ పై సిబిఐ విచారణకు బాబు రెడీ నా?

109
SHARE

బోగాపురం ఎయిర్ పోర్టు టెండర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోగస్ టెండర్ గా మార్చారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన ఈ విషయమై కేంద్ర మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు కూడా చేశారు.

ఎయిర్ పోర్టు అధారిటీకి న్యాయంగా వచ్చిన టెండర్ ను రద్దు చేసి, ప్రభుత్వ సంస్తలు టెండర్ లో పాల్గొనకూడదని ఆంధ్ర ప్రదేశ్ఎ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తీరు అన్యాయం అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాలని సోము వీర్రాజు మంత్రి ని కోరారు. ఈ విషయం పై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ కోర్టుకు కూడా వెళతామని వీర్రాజు తెలియచేసారు.

బీజేపీ ఎంఎల్ సి కొద్ది రోజులుగా ఈ విషయం పై పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.