Home రాజకీయాలు ఏపీ బాండ్లు బాబు బినామీలు కొనుగోలు చేశారా?

ఏపీ బాండ్లు బాబు బినామీలు కొనుగోలు చేశారా?

126
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రంగా దోచిన సొమ్ము బాండ్లలో పెట్టుబడి పెట్టారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధీ, మాజీ మంత్రి కె.పార్దసారధి ఆరోపించారు. ఈ ఏపీ బాండ్లను తొమ్మిది మంది పెట్టుబడిదారులు కొనుగోలు చేశారని అన్న ఆయన వారు ఎవరు అని ప్రశ్నించారు.

వారు చంద్రబాబుకు సంబందించిన వారని, గట్టి అనుమానం వ్యక్తం చేశారు. ఎపి ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేసారని ఆరోపించిన పార్ధసారధి ఇప్పుడు తన సొంత డబ్బును ఈ రకంగా పెట్టుబడి గా పెట్టి వడ్డీ పొందే దుష్ట ఆలోచన చేశారని ఆయన ఆరోపించారు. గతంలో ఇదే ప్రభుత్వం ఎనిమిది శాతం కంటే తక్కువ వడ్డీకి రుణం ఇస్తే హడ్కో నుంచి రుణాలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చారని, అలాంటిది ఇప్పుడు 10.37 శాతం వడ్డీ కి బాండ్లు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు.

ఏపీ బాండ్ల విషయంలో ప్రభుత్వ వైఖరి మోసమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రిటైరై న సీనియర్ లకి కూడా డిపాజిట్ల పై ఆరు శాతం వడ్డీ రావడం లేదని, అలాంటి వారికి ఈ బాండ్లు ఇవ్వటం ఎంతో ఉపయోగం కదా అని ఆయన అన్నారు.