Home రాజకీయాలు తెదేపా నేతలు కాంగ్రెస్ తో పొత్తు కావాలంటున్నారట

తెదేపా నేతలు కాంగ్రెస్ తో పొత్తు కావాలంటున్నారట

157
SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు కదులుతున్నారు అనేది సత్యం. ఇది బాబు కి ఎంతైనా ఓపెన్ గా చెప్పుకోటానికి ఇబ్బంది కలిగించే విషయమే. ఆ కారణం తోనే పార్టీ నేతలను సిద్దం చేయటానికి రకరకాల లీకులు ఇస్తున్నారు. తాజాగా తమ పార్టీ నేతలంతా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నట్టు లీక్ లు ఇప్పించడం షురూ చేశారు.

దానిలో భాగమే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చని టిడిపి నేతలు ముఖ్యమంత్రితో జరిపిన సమావేశంలో భావించారట అలా మీడియాలో లీక్ ఇచ్చారు.

బహుశా బాబు మర్చిపోయిఉండొచ్చేమో కానీ అప్పుడెప్పుడో రాహుల్ గాందీ ప్రత్యేక హోదా మీటింగ్ పెడితే టిడిపి తీవ్ర నిరసన ప్రకటించింది. అసలు ఏపీ ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ని బాబు క్షమించటమంటే నిజంగా గ్రేటే. అంతేనా రాహుల్ గాందీ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే బాబు కోడలు ఆ సమావేశానికి వెళ్లేంతగా కాంగ్రెస్ చేసిన అన్యాయం మర్చిపోయింది తెదేపా నాయకత్వం. బాబు గారి అవకాశవాద రాజకీయాలు ఇలానే ఉంటాయి మరి!!