Home రాజకీయాలు సుజనా చౌదరి కక్కుర్తిని ఎండకడుతున్న నెటిజన్లు!

సుజనా చౌదరి కక్కుర్తిని ఎండకడుతున్న నెటిజన్లు!

SHARE

ఓ పక్క వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళ ని చూస్తే ఎంతటివారికైనా ఎంతోకొంత సాయం చేయాలని ఉంటోంది. రాష్ట్రంలో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయి రాకపోకలు నిలిచిన నేపథ్యంలో అన్ని మూలల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించగా, అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వాలు ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేయటానికి ముందుకు వస్తున్నారు. సీనీ, క్రికెట్‌, రాజకీయ నాయకులు కేరళకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. కాంగ్రెస్, శివసేన ఎంపీ లు తమ నెల జీతాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.

ఇదే నేపథ్యంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కూడా ముందుకొచ్చారు సాయం ప్రకటించారు. కానీ అయ్యవారి కక్కుర్తి ని నెట్టింట్లో ప్రజలు ఎండకాడుతున్నారు. సుజనా కేరళ వరద బాధితుల కోసం 20 లక్షల రూపాయల సాయం ప్రకటించారు.

ఇది వినటానికి బాగానే ఉన్నాఇది ఆయన చేసిన వ్యక్తిగత సాయం కాదు. ఎంపీలకు వుండే ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి అంట.. ఈ కక్కుర్తే జననాలకి మండింది. ప్రభుత్వ సొమ్మును సొంత సాయంగా ప్రకటించుకోవడమేంటని ప్రజలు తప్పుపడుతున్నారు.