Home రాజకీయాలు భాజపా కి ఆదరణ తగ్గింది కానీ…:మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే

భాజపా కి ఆదరణ తగ్గింది కానీ…:మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే

238
SHARE

దేశ వ్యాప్తంగా బిజెపికి కొంత ఆదరణ తగ్గిన మాట వాస్తవ మేనని అయితే రాబోయే లోక్ సభ ఎన్నికలలో మాత్ర౦ తిరిగి ఎన్ డి ఎ నే అధికారం చేపడుతుందని తాజా సర్వే వెల్లడించింది.

ఇండియా టుడే కార్వీ ఇన్‌సైట్స్‌ కలిపి చేపట్టిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (MOTN) సర్వే చిత్రమైన రిజల్ట్స్ ఇచ్చింది. సర్వే ప్రకారం 543 స్ధానాలున్న లోక్‌సభ లో భాజపా నేతృత్వం లోని ఎన్‌డీఏకు 281 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్‌ నేతృత్వం లోని యూపీఏ కూటమికి 122 సీట్లు దక్కుతాయట. ఇతర స్వతంత్ర రాజకీయ పార్టీ లకు 140 సీట్ల వరకు దక్కవచ్చు అట . అయితే ఈ 140 సీట్లు గెలుచుకున్న పార్టీలు కీలకం కానున్నాయి.

మరోపక్క 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 స్ధానాలను గెలుచుకుని ఎన్‌డీఏ కూటమి కి 336 సీట్లు దక్కాయి. ఆ లెక్కన దగ్గర దగ్గర 50 సీట్లు కోల్పోనుంది ఎన్‌డీఏ. ఇక ఓట్ల శాతం చూస్తే ఎన్‌డీఏ ki ముప్పై ఆరు శాతం, యుపిఎకి ముప్పై ఒక్క శాతం ఓట్లు లభించవచ్చు అని సర్వేతెలిపింది.

ఇలాంటి టైం లో ఈ సర్వే లు ఎందుకని అనుకోవచ్చు అయితే…ఇవే రాజకీయ పోట్లని డ్రైవ్ చేసేది అని గుర్తుపెట్టుకుందాం!