Home రాజకీయాలు జగన్ ఐదు పెళ్లిళ్ల కామెంట్….ఈ సారి…?!

జగన్ ఐదు పెళ్లిళ్ల కామెంట్….ఈ సారి…?!

SHARE

విపక్ష నేత వైస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. బాబు ఐదు పెళ్లిళ్లు చేసుకుని వదిలేశారని జగన్ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ ను, సీపీఐ, సీపీఎం లను బీజెపీ ని జనసేన పార్టీ ని పెళ్లి చేసుకుని వదిలేశారని ఎగతాళి చేశారు. అంతటితో ఆగక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తో ఆరో పెళ్లికి సిద్ధమయ్యార౦టూ ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా లో ప్రవేశించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర కోటవురట్ల లో ఈ రోజు పాదయాత్ర చేసారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం మన౦దరి ఖర్మ అన్నారు. రాష్ట్రం యావత్తూ దోచేస్తున్నారని అధికార పార్టీ ని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ముఖ్యమంత్రి అని విమర్శించారు.

బాబు గారి పాలన లో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కూడా జగన్ వాపోయారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బాబు అంటున్నారు కానీ నిజానికి ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కూడా లేవని జగన్ అన్నారు.

అవినీతి సొమ్ముతో సంతలో పశువుల వలె ఎమ్మెల్యే లను కొంటున్నారనీ అలా కొన్న వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని మండిపడ్డారు. రాజధానిలో పర్మినెంట్ గా అంటూ ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్‌ కట్టడానికి అడుగుకు రూ.10 వేలు ఇచ్చారని…అయినప్పటికీ బయట 3 సెంటీమీటర్ల వర్షం పడితే, సెక్రటేరియట్ లో 6 సెంటీమీటర్ల వర్షం లీక్ అవుతోందని గేలి చేశారు. చంద్రబాబు పాలన అవినీతి, అబద్ధాలు, మోసాలతో సాగుతోందని విమర్శించారు.