Home రాజకీయాలు టీడీపీ కోసం తపిస్తున్న విశాఖ ట్రాఫిక్‌ ఏసీపీ

టీడీపీ కోసం తపిస్తున్న విశాఖ ట్రాఫిక్‌ ఏసీపీ

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ పలు విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగేళ్లుగా పోలీసు వ్యవస్థను టీడీపీ పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకుందన్న విమర్శలు బలంగా ఉన్నాయి.

స్వామిభక్తిని ప్రదర్శించే పోలీసులకే మంచి పోస్టులు దక్కుతున్నాయన్న ఆరోపణా ఉంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు తప్పు చేసినా చర్యలు ఉండవన్నది అందరూ చెబుతున్న మాట. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు సొంత సోదరుడు, విశాఖ ట్రాఫిక్ ఏసీపీ కింజారపు ప్రభాకర్‌ తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆయన యూనిఫాంలోనే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీడీపీ పోస్టర్లనూ ఆవిష్కరిస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ టీడీపీ యువత తయారు చేసిన సీబీఎన్ ఆర్మీ పోస్టర్‌ను ప్రభాకర్ ఆవిష్కరించారు. యూనిఫాంలోనే ఆ పనిచేసి ధైర్యంగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.

అయినా దీనిపై కనీసం వివరణ కోరే ధైర్యం కూడా ఉన్నతాధికారులు చేయలేకపోతున్నారు. మరో విషయం ఏమిటంటే నాలుగేళ్లుగా ప్రభాకర్‌ విశాఖలోనే ఉన్నారు. బదిలీ అన్నది మాత్రం జరగడం లేదు. ఇదంతా అన్న మంత్రి కావడం, ఈయన టీడీపీకి వీరాభిమాని కావడం వల్లే జరుగుతోందని పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు.